Jobs22nd Jul 04:03 PMSunil Byrisetty1 min read
మంగళగిరిలో 50వేల మందికి ఉద్యోగాలు!
మంగళగిరికి ఐటీ, ఇతర కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, భవిష్యత్ లో 50వేల మంది పనిచేసేందుకు అవకాశం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్
మంగళగిరికి ఐటీ, ఇతర కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని, భవిష్యత్ లో 50వేల మంది పనిచేసేందుకు అవకాశం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మంగళగిరి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై ఉండవల్లి నివాసంలో అధికారులతో మంత్రి సమీక్షించారు. వివిధ పనుల పురోగతిని అధికారులు పవర్ పాయింట్ ప్రజెంజేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరికి ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. ఇందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పై అధికారులు దృష్టిసారించాలన్నారు. మంగళగిరిలో వివిధ ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వారికి రెండో విడతలో 2 వేల ఇళ్ల పట్టాల పంపిణీకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మిగిలిన ఇళ్ల పట్టాల విషయంలోనూ పనులను వేగవంతం చేయాలని సూచించారు.