News25th Sep 05:34 PMSunil Byrisetty1 min read
మహిళలకు గార్మెంట్ పరిశ్రమల్లో ఉపాధి
మహిళా సాధికారితలో భాగంగా టైలరింగ్ లో ఉచిత శిక్షణ పొందిన మహిళలకు రాష్ట్రంలోని వివిధ గార్మెంట్ పరిశ్రమల్లో ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత త
మహిళా సాధికారితలో భాగంగా టైలరింగ్ లో ఉచిత శిక్షణ పొందిన మహిళలకు రాష్ట్రంలోని వివిధ గార్మెంట్ పరిశ్రమల్లో ఉపాధి కల్పనకు కృషి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఏపీ బీసీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 2025-26 సంవత్సరానికి మహిళల జీవనోపాధి నిమిత్తం ఉచిత టైలరింగ్ శిక్షణ అందజేస్తున్నామన్నారు. 90 రోజుల పాటు టైలరింగ్ శిక్షణ అందజేస్తున్నామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్ ఉచితంగా ఇవ్వడమే కాకుండా సర్టిఫికెట్ కూడా ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో మహిళల కుట్టు శిక్షణ విజయంతంగా నిర్వహిస్తున్నామని, శిక్షణ పట్ల మహిళల్లో సంతోషం వ్యక్తమవుతోందని అన్నారు. శిక్షణకు హాజరయ్యే మహిళలను ఫేషీయల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) హాజరు తీసుకుంటున్నామన్నారు. మహిళల ఉపాధి కల్పనకు ఏపీ స్కిల్ డవలప్ మెంట్ తో కలిసి పనిచేస్తున్నామన్నారు. పలు గార్మెంట్ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి, టైలరింగ్ లో శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి లభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సవిత వెల్లడించారు.