National1st Sep 04:11 PMSunil Byrisetty1 min read
ముగిసిన 185 ఏళ్ల చరిత్ర
185 ఏళ్ల చరిత్ర కలిగిన పోస్టు బాక్స్ లు ఇకపై కనిపించవు. ఈ బాక్సులు సెప్టెంబర్ 1 నుంచి పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఈ మేరకు భారత తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లేఖలు, రిజిస్టర
185 ఏళ్ల చరిత్ర కలిగిన పోస్టు బాక్స్ లు ఇకపై కనిపించవు. ఈ బాక్సులు సెప్టెంబర్ 1 నుంచి పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఈ మేరకు భారత తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లేఖలు, రిజిస్టర్ పోస్టులు, శుభాకాంక్షలు అన్నీ స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా గమ్యస్థానానికి చేరతాయి. తపాలా కార్యాలయాలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయి. వాట్సాప్, ఇమెయిల్ వంటి సాంకేతికత కారణంగా పోస్టు బాక్స్ వినియోగం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో తపాలా శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.