News18th Jul 03:03 PMSunil Byrisetty1 min read

మందపల్లి దేవస్థానంలో కమిషనర్ పర్యటన

దేవదాయ ధర్మదాయ కమిషనర్ శ్రీ కె.రామచంద్రమోహన్ మందపల్లి శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. గోదావరి పుష్కరాలు–2027 దృష్ట్యా సి.జి.ఎఫ్. నిధులతో నిర్మిస్తున్న రూ

మందపల్లి దేవస్థానంలో కమిషనర్ పర్యటన
దేవదాయ ధర్మదాయ కమిషనర్ శ్రీ కె.రామచంద్రమోహన్ మందపల్లి శ్రీ మందేశ్వర (శనేశ్వర) స్వామి దేవస్థానాన్ని సందర్శించారు. గోదావరి పుష్కరాలు–2027 దృష్ట్యా సి.జి.ఎఫ్. నిధులతో నిర్మిస్తున్న రూ.3 కోట్ల తైలాభిషేక మండపం, రూ.1.20 కోట్ల అన్నప్రసాద భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి నాణ్యతతో గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అన్నప్రసాదాన్ని భక్తులకు స్వయంగా వడ్డించి వారి అభిప్రాయాలను తెలుసుకొన్నారు. మీడియా ప్రతినిధులతో సమావేశమై దేవస్థాన అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేశారు.
Andhra Pradesh
Mandapalli Temple
Mandeswara Swamy Temple
Shani Temple
Endowments Commissioner
K Ramachandra Mohan
గోదావరి పుష్కరాలు 2027
ఆలయ అభివృద్ధి
అన్నప్రసాదం
ఆంధ్రప్రదేశ్
Scroll for the next article