News9th Jul 03:56 PMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధికి కృతనిశ్చయం
విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రమైన ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధి, సామాన్య భక్తులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్
విజయవాడ కనకదుర్గమ్మ క్షేత్రమైన ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధి, సామాన్య భక్తులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే తమ మొదటి ప్రాధాన్యత అని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న పోటు (ప్రసాదశాల) అన్నప్రసాద భవన నిర్మాణ పనులను పరిశీలించారు. జులై 15 లోపు ఇంద్రకీలాద్రి 'మాస్టర్ ప్లాన్' డ్రాఫ్టు నమూనా సిద్ధం కావాలి. శ్రావణ మాసంలోగా నూతన లడ్డూ పోటు, అన్నదాన భక్తుల కోసం వినియోగం లోనికి తేవాలి. నిర్మాణ పనుల జాప్యం పై దేవాదాయ కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎలివెటెడ్ క్యూ కాంప్లెక్స్ కింద వ్యాపార లావాదేవీలపై కమిషనర్ సీరియస్ అయ్యారు. దుకాణాలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. ఇంద్రకీలాద్రి భవిష్యత్తు అవసరాలను దృష్టి లో ఉంచుకుని రూపొందిస్తున్న 'మాస్టర్ ప్లాన్' తుది నమూనాను జులై 15 లోపు సిద్ధం చేసి తమకు సమర్పించాలని ఆదేశించారు.