Crime10th Jul 11:32 AMSunil Byrisetty1 min read

బెట్టింగ్ వ్యవహారంలో 29 మంది సినీ సెలబ్రిటీలపై కేసు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్ వ్యవహారంలో 29 మంది సినీ సెలబ్రిటీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. హీరో విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, మంచు లక

బెట్టింగ్ వ్యవహారంలో 29 మంది సినీ సెలబ్రిటీలపై కేసు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన బెట్టింగ్ యాప్ వ్యవహారంలో 29 మంది సినీ సెలబ్రిటీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. హీరో విజయ్ దేవరకొండ, రాణా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, ప్రణీత సుభాష్, యాంకర్ శ్రీముఖి, యాంకర్ శ్యామల, యూట్యూబర్లు హర్షా సాయి, బయ్య సన్నీ యాదవ్, లోకల్ బాయ్ నాని లతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసింది. దరాబాద్–సైబరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా, పీఎంఎల్ఏ కింద వీరిని విచారించనుంది. సినీ సెలబ్రిటీలు, యూట్యూబర్లు, ఇన్‌స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, బీటింగ్ కంపెనీలపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. వీరిని విచారిస్తే మరిన్ని సినీ పెద్దల పేర్లు బయటపడతాయని ప్రచారం జరుగుతోంది.
Tollywood
crime news
Betting app case
case against 29 celebrities
ED files case
Betting App Promotions Case
శ్రీముఖి
రానా దగ్గుబాటి
విజయ్ దేవరకొండ
Scroll for the next article