Spiritual13th Jan 01:33 PMSunil Byrisetty1 min read
భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు
దుర్గ గుడికి విచ్చేసే భక్తులకు అమ్మవారి ఆలయంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం ఆలయ ఈ.ఓ. వి.కె. శీనా నాయక్ ఆకస్మిక తనిఖీలు
దుర్గ గుడికి విచ్చేసే భక్తులకు అమ్మవారి ఆలయంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మంగళవారం ఆలయ ఈ.ఓ. వి.కె. శీనా నాయక్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పూజా మండపాలు, ఉచిత ప్రసాద వితరణ కేంద్రం, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశం ఉచిత వైద్య శిబిరాన్ని ఈ.ఓ. క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రసాద వితరణలో ఉపయోగించే పాత్రల శుభ్రత, యంత్ర పరికరాల పనితీరు, విద్యుత్ సరఫరా ప్రాంగణమంతా పరిశుభ్రంగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో ఉన్న అర్చకులు, నర్సులు, కొబ్బరికాయల కాంట్రాక్టర్లతో మాట్లాడి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలందించాలని సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల సంతృప్తి స్థాయిని పెంచేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని, తద్వారా ఆలయ ప్రతిష్టను కాపాడాలని కోరారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించడంలో ఎటువంటి అలసత్వం వహించకూడదని ఈ సందర్భంగా సిబ్బందిని ఆయన హెచ్చరించారు.