News1st May 11:52 AMSunil Byrisetty1 min read
సింహాచలం ఘటనపై విచారణ కమిషన్
విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ అ
విశాఖ జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో జరిగిన ప్రమాద ఘటనపై ఏపీ ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది.
పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ అధ్యక్షతన ఈ కమిషన్‌ను నియమించింది.
ఇందులో సభ్యులుగా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆకే రవికృష్ణ, జలవనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు ఉంటారని పేర్కొంది.
అలాగే, ఈ కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు కల్పిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ కమిషన్ 72 గంటల్లో ప్రాథమిక నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.