News21st Sep 12:22 PMSunil Byrisetty1 min read

భూములిచ్చిన రైతులకు న్యాయం చేయండి

అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. రాజధానికి తొలి విడతగా 34 వేల ఎకరాలిచ్చిన ర

భూములిచ్చిన రైతులకు న్యాయం చేయండి
అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని మాజీ మంత్రి, రైతు సంఘాల సమన్వయ కమిటీ నాయకులు వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. రాజధానికి తొలి విడతగా 34 వేల ఎకరాలిచ్చిన రైతులతో ప్రభుత్వం చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటికీ న్యాయం జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సీడ్ క్యాపిటల్‌‌లో ఉన్న ప్రతి గ్రామంలో అన్ని సదుపాయాలతో కూడిన ఆ అధునాతన ఆస్పత్రితోపాటు పాఠశాలలు నిర్మించాలన్న సంగతిని ప్రభుత్వం మరిచిపోయిందని విమర్శించారు. భూములిచ్చిన రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, సీఆర్డీయే ఇచ్చిన ప్లాట్ల డాక్యుమెంట్లకు విలువ లేదా? అని ప్రశ్నించారు. ఎస్ఆర్ఎం, విట్ తదితర కాలేజీలకు వందల ఎకరాలు కేటాయించిన ప్రభుత్వం, ఆ భూములిచ్చిన రైతుల పిల్లలకు ఉచితంగా చదువులు ఎందుకు చెప్పించదని నిలదీశారు. విజయవాడ పక్కనే గన్నవరం ఎయిర్‌‌పోర్టు ఉండగా, రాజధాని అమరావతిలో వందల ఎకరాలు కేటాయించి మరో ఎయిర్‌ ‌పోర్టు నిర్మించడం అవసరమా అని ప్రశ్నించారు.
Scroll for the next article