News24th Mar 10:32 AMSunil Byrisetty1 min read

విజయవాడలో నైట్ లైఫ్!

కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని రూపురేఖలు మారుతున్నాయి. రాజధాని పరిధిలోని విజయవాడ నగరం వేగంగా వృద్ధి చెందుతోంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి వివిధ పనులు, ఉద్యోగాల నిమిత్తం వచ్చి అర్ధర

విజయవాడలో నైట్ లైఫ్!
కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని రూపురేఖలు మారుతున్నాయి. రాజధాని పరిధిలోని విజయవాడ నగరం వేగంగా వృద్ధి చెందుతోంది. చుట్టుపక్కల జిల్లాల నుంచి వివిధ పనులు, ఉద్యోగాల నిమిత్తం వచ్చి అర్ధరాత్రి వరకు ఉంటుంటారు. వారికి సైతం ఆహారం విషయంలో ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలో అర్ధరాత్రి 12 వరకు రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచేందుకు అనుమతినిచ్చింది. ఈ నిర్ణయంపై సీఎం చంద్రబాబు, విజయవాడ సీపీకి హోటళ్ల సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి. గత టీడీపీ ప్రభుత్వంలోనూ అర్ధరాత్రి వరకు హోటళ్లు తెరిచేందుకు ఉత్తర్వులిచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కూడా అదే విధమైన ఉత్తర్వులు జారీ చేసింది.
Vijayawada
Amaravati
Chandra babu
టీడీపీ
Scroll for the next article