News8th Dec 02:43 PMSunil Byrisetty1 min read
ఈ-పాన్ కార్డు మోసాలు.. ఫ్యాక్ట్ చెక్ !
నకిలీ ఈ-మెయిల్స్ పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆదాయ పన్ను శాఖ హెచ్చరించింది. ఈ-పాన్ కార్డు (e-PAN) డౌన్‌లోడ్ చేసుకోమంటూ వస్తున్న మోసపూరిత మెయిల్స్‌ను నమ్మవద్దని, వాటికి స్పందించవ
నకిలీ ఈ-మెయిల్స్ పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని ఆదాయ పన్ను శాఖ హెచ్చరించింది. ఈ-పాన్ కార్డు (e-PAN) డౌన్‌లోడ్ చేసుకోమంటూ వస్తున్న మోసపూరిత మెయిల్స్‌ను నమ్మవద్దని, వాటికి స్పందించవద్దని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సహకారంతో ఫ్యాక్ట్-చెక్ హెచ్చరికను జారీ చేసింది. ఆదాయ పన్ను శాఖ పేరుతో పంపే ఈ-మెయిల్స్‌లో ఎప్పుడూ వ్యక్తిగత వివరాలు, పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌లు లేదా క్రెడిట్ కార్డు, బ్యాంకు ఖాతాల వంటి ఆర్థిక సమాచారాన్ని అడగబోమని ఐటీ శాఖ స్పష్టం చేసింది. ప్రజలను మోసం చేసేందుకు సైబర్ నేరగాళ్లు పంపే "e-PAN కార్డు డౌన్‌లోడ్‌కు దశలవారీ సూచనలు" అనే నమూనా ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను కూడా పీఐబీ విడుదల చేసింది. అలాంటి ఫిషింగ్ ఈ-మెయిల్స్ వస్తే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని ఐటీ శాఖ పన్ను చెల్లింపుదారులను కోరింది. ఆదాయ పన్ను శాఖ పేరుతో మెయిల్ వస్తే, ఆ వివరాలను webmanager@incometax.gov.in కు.. ఇతర సంస్థల పేరుతో వస్తే incident@cert-in.org.in కు ఫార్వార్డ్ చేయాలని తెలిపింది.