Education28th Apr 05:07 PMSunil Byrisetty1 min read
అవరోధాలను అధిగమించి.. ఉన్నత స్థానాలకు చేరుకోవాలి
ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు అవరోధాలను అధిగమించి.. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్ట
ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులు అవరోధాలను అధిగమించి.. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు.
పాఠశాల విద్యాశాఖ-సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులకు ఉపకరణాలను పంపిణీ చేశారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు, కలెక్టర్ లక్ష్మీ శ పాల్గొని ఉపకరణాలు పంపిణీ చేశారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన 173 మంది లబ్ధిదారులకు రూ. 18.70 లక్షల విలువైన 273 పరికరాలను పంపిణీ చేసినట్లు తెలిపారు.
బ్యాటరీ ఆపరేటెడ్ మోటరైజ్డ్ ట్రైసైకిళ్లు, బ్రెయిలీ కిట్లు, క్రచ్ ఎల్బోలు, టీఎల్ఎం కిట్లు, వీల్ ఛెయిర్లు, వాకింగ్ స్టిక్‌లు, రోలటార్లు అందజేయడం జరిగిందన్నారు.
ప్రత్యేక అవసరాలున్న విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు.
విద్యార్థులు బాగా చదువుకొని కెరీర్ పరంగా ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవాలన్నారు.