Notifications11th Apr 09:16 AMSunil Byrisetty1 min read
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఈఎస్ఐలో ఉద్యోగాలు
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్- ఢిల్లీలో 558 స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగా
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్- ఢిల్లీలో 558 స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఉద్యోగాల కోసం మే 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
సంబంధిత విభాగంలో MS/ MD/ MCH/ DM/ MSC చేసిన వారు అర్హులని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
45 ఏళ్ల వయసు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ప్రారంభ జీతం సీనియర్ స్కేల్ నెలకు రూ.78,800, జూనియర్ స్కేల్ రూ.67,700 వరకు ఉంటుందని పేర్కొన్నారు.
మరిన్ని వివరాలకు వెబ్సైట్: https://www.esic.gov.in/ సంప్రదించాలని సూచిస్తున్నారు.