National9th Oct 04:44 PMSunil Byrisetty1 min read

ధరలు మండుతుంటే మోదీ భజనలో బాబు!

దేశంలో, రాష్ట్రంలో నిత్యావసర సరుకులు బియ్యం, పప్పులు, నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు మండిపోతుంటే

ధరలు మండుతుంటే మోదీ భజనలో బాబు!
దేశంలో, రాష్ట్రంలో నిత్యావసర సరుకులు బియ్యం, పప్పులు, నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరలు మండిపోతుంటే కేంద్రంలో ఉన్న మోడీకి, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు, పవన్‌లకు ఇవేమీ పట్టడం లేదన్నారు. రాబోయే ఎన్నికలలో ప్రజల ఓట్లు ఎలా దండుకోవాలి, సీట్లన్నీ ఎలా రాబట్టుకోవాలి అనే ప్రయత్నాలు తప్ప, ప్రజలపై భారాలను ఎలా తగ్గించాలి, ధరల నియంత్రించి ప్రజలను ఆదుకోవాలనే ఆలోచన ఏ కోశానా ప్రభుత్వాలకు రావటం లేదని పేర్కొన్నారు. ఎన్నికల వేళ ధరల నియంత్రణ, పన్నులు భారాలు లేకుండా చూస్తాం, సూపర్ సిక్స్ అమలు చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ప్రజలను మోసం చేశారని, స్థానిక ఎన్నికల వేళ ఓటుతో ప్రజలు నిరసన తెలపాలని వ్యాఖ్యానించారు. ఈ మేరకు విజయవాడలో సీపీఎం ప్రజాపోరు యాత్ర నిర్వహించారు.
Scroll for the next article