News27th Aug 01:22 PMSunil Byrisetty1 min read

ధరలన్నీ పైపైకి.. ఘొల్లుమంటున్న సామాన్యుడు

నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఉల్లిపాయలు, ఎండు మిర్చి, చక్కెర, వంట నూనెలు ఇలా రోజువారీ సరుకుల రేట్లు రెట్టింపు దిశగా దూసుకెళ్తున్నాయి. గతేడాది ఆగస్టులో ఉన్న ధరలకూ, ఈ ఏడాది ఆ

ధరలన్నీ పైపైకి.. ఘొల్లుమంటున్న సామాన్యుడు
నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఉల్లిపాయలు, ఎండు మిర్చి, చక్కెర, వంట నూనెలు ఇలా రోజువారీ సరుకుల రేట్లు రెట్టింపు దిశగా దూసుకెళ్తున్నాయి. గతేడాది ఆగస్టులో ఉన్న ధరలకూ, ఈ ఏడాది ఆగస్టు నెలలో ధరలకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. గతేడాది రూ.29 ఉన్న ఉల్లి కిలో ఇప్పుడు రూ.52.62గా ఉంది. సన్‌ఫ్లవర్ ఆయిల్ లీటరుకు రూ.177.22గా ఉండగా, ఏడాదిలో 21.40 శాతం పెరిగింది. పామాయిల్ రూ.152.54 ఉండగా, గతేడాది రూ.129 ఉంది. వేరుశనగ నూనె రూ.159 నుంచి రూ.183.46 వరకు పెరిగింది. గ్రేడ్-1 కందిపప్పు కిలో రూ.133.10గా ఉండగా, గతేడాది రూ.117గా ఉంది. గ్రేడ్-2 ధర 121.93తో 14.56 శాతం పెరిగింది. సూపర్‌ఫైన్ గ్రేడ్-1 బియ్యం 11.45 శాతం, ఫైన్ రకం 13.57 శాతం, సాధారణ గ్రేడ్-2 12.02 శాతం పెరిగాయి. మిగతా వస్తువులతో పోలిస్తే చింతపండు ధరల్లో పెరుగుదల తక్కువగా ఉంది. గ్రేడ్-1 2.27 శాతం పెరిగింది. సాధారణ రకం 5.19 శాతం, మూడో రకం 10.49 శాతం పెరిగాయి. ఈ నెల ఆరంభంలో కిలో రూ.45 వరకు ఉన్న పంచదార ధర తాజాగా రూ.65 వరకు పెరిగింది.
Andhra Pradesh
Essential Commodities
Rising Prices
Inflation
Cost of Living
Onion Prices
Cooking Oil Prices
Sugar Prices
Rice Prices
Toor Dal
Tamarind Prices
ఆహార ద్రవ్యోల్బణం
కుటుంబ ఖర్చులు
వినియోగదారుల ధరలు
ఆంధ్రప్రదేశ్
ధరల పెరుగుదల
ఏపీ న్యూస్
Scroll for the next article