News20th Aug 11:36 AMSunil Byrisetty1 min read
ఇథనాల్ దెబ్బకు చేదెక్కిన పంచదార!
దేశంలో చక్కెర ధరలు భారీగా పెరుగుతున్నాయి. కిలో రూ. 40 ఉన్న సుగర్ రూ. 65కు చేరింది. ఎగుమతులు నిలిపేసినా, తగినంత చెరకు ఉత్పత్తి అవుతున్నా మార్కెట్లో కొరత ఉంది. అందుకు కారణం ఇథనాల్(E2
దేశంలో చక్కెర ధరలు భారీగా పెరుగుతున్నాయి. కిలో రూ. 40 ఉన్న సుగర్ రూ. 65కు చేరింది. ఎగుమతులు నిలిపేసినా, తగినంత చెరకు ఉత్పత్తి అవుతున్నా మార్కెట్లో కొరత ఉంది. అందుకు కారణం ఇథనాల్(E20) ఉత్పత్తి కోసం చెరకు పంట డైవర్ట్ అవుతుండటమేనని నిపుణులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతమున్న 100% ఇంపోర్ట్ డ్యూటీని ఎత్తేసి చక్కెర దిగుమతి చేసుకోవాలని కేంద్రం భావిస్తోందని ప్రముఖ మీడియా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. దేశంలో ఈ నెల్లోనే 50% రేట్ పెరగింది. దేశవ్యాప్తంగా మిల్లుల వద్ద 100 కిలోల చక్కెర ధర రూ.5,400-రూ.5,500 వరకు పలికింది. ఏడాది క్రితం రూ.3,900గా ఉండేదని మార్కెట్ వర్గాలు చెప్పాయి. ఇంధనాల్ వల్ల వచ్చే ఏడాది నిల్వలు తగ్గొచ్చనే అంచనాలే కారణమని తెలుస్తోంది.