National17th Jun 01:25 PMSunil Byrisetty1 min read
పశ్చిమాసియాలో హైటెన్షన్.. భారత విదేశాంగ కీలక ఆదేశాలు..
పశ్చిమాసియాలో హైటెన్షన్ నెలకొన్న నేపథ్యంలో భారత విదేశాంగ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆందోళనకరంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెహ్రాన్ లోని భారతీయ
పశ్చిమాసియాలో హైటెన్షన్ నెలకొన్న నేపథ్యంలో భారత విదేశాంగ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఆందోళనకరంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టెహ్రాన్ లోని భారతీయ విద్యార్థులు వెంటనే నగరాన్ని విడిచి వెళ్లాలని సూచనలు చేసింది. అందుకోసం ఇరాన్ లోని భారత రాయబార కార్యాలయం ఏర్పాట్లు చేసింది. కొంతమంది భారతీయులు అర్మేనియా సరిహద్దు ద్వారా ఇరాన్‌ను విడిచిపెట్టేందుకు వీలు కల్పించింది. ఇరాన్‌లోని భారతీయులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి పరిస్థితులను వివరిస్తున్నట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటనలో తెలిపింది.