News16th Dec 10:26 AMSunil Byrisetty1 min read

సీఎం అడిగినా నో చెబుతా: బ్రాహ్మణి

సీఎం చంద్రబాబు కోడలు, మంత్రి లోకేష్ భార్య, ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి రాజకీయాలపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదన్నారు. హెరిటేజ్

సీఎం అడిగినా నో చెబుతా: బ్రాహ్మణి
సీఎం చంద్రబాబు కోడలు, మంత్రి లోకేష్ భార్య, ఎమ్మెల్యే బాలకృష్ణ కుమార్తె నారా బ్రాహ్మణి రాజకీయాలపై తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తనకు లేదన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ సంస్థకే తన తొలి ప్రాధాన్యమని, దాని ద్వారా సమాజంపై గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందని ఆమె పేర్కొన్నారు. బిజినెస్ టుడే సంస్థ నిర్వహించిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ 2025' కార్యక్రమంలో బ్రాహ్మణి "ఒకవేళ చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాల్లోకి రావాలని కోరితే ఏమంటారు?" అని నిర్వాహకులు ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. "రాజకీయాలు నాకు ఆసక్తికరమైన రంగం కాదు" అని స్పష్టంగా సమాధానమిచ్చారు. తనకు వ్యక్తిగతంగా ఆరోగ్యం, పోషణ రంగాలపై చిన్నప్పటి నుంచే ఎంతో ఆసక్తి ఉందని, ప్రస్తుతం ఆ రంగంలోనే పనిచేయడం సంతృప్తినిస్తోందని వివరించారు.
Andhra Pradesh
Nara Brahmani
Chandrababu Naidu
Nara Lokesh
Balakrishna
Telugu Politics
Heritage Foods
Business Today
Most Powerful Women 2025
Women Leaders
పవర్‌ఫుల్ విమెన్ 2025
మహిళా నాయకత్వం
Scroll for the next article