News7th Aug 05:06 PMSunil Byrisetty1 min read
ప్రతి ఔషధ తనిఖీ.. రోగి భద్రత కోసమే
ఔషధ తయారీ సంస్థల్లో జరిగే ప్రతి తనిఖీ, ప్రయోగశాల పరీక్ష, నియంత్రణ సంస్థలు తీసుకునే ప్రతి నిర్ణయం నేరుగా రోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్
ఔషధ తయారీ సంస్థల్లో జరిగే ప్రతి తనిఖీ, ప్రయోగశాల పరీక్ష, నియంత్రణ సంస్థలు తీసుకునే ప్రతి నిర్ణయం నేరుగా రోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఇండియా కార్యాలయం కంట్రీ డైరెక్టర్ గ్రెగరీ స్మిత్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యాన్ని కాపాడాలంటే శాస్త్రీయ విధానాలు, అంతర్జాతీయ సహకారం, నాణ్యమైన తనిఖీ వ్యవస్థ మరింత బలోపేతం కావాలని చెప్పారు. అమెరికా ఎఫ్‌డీఏ పర్యవేక్షణలో ఉన్న ఔషధ తయారీ కేంద్రాల్లో సగానికి పైగా అమెరికా వెలుపలే ఉన్నాయని, అందులో భారత్ అత్యంత కీలక భాగస్వామి అని గ్రెగరీ స్మిత్ తెలిపారు. అమెరికాకు ఎగుమతి అయ్యే మందుల తయారీలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రాష్ట్రంలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఏ - US FDA) ఆమోదం పొందిన 119 ఔషధ తయారీ కేంద్రాలు ఉండటం ఏపీ ఫార్మా రంగ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.