Politics2nd Nov 05:10 PMSunil Byrisetty1 min read

కౌంటింగ్‌లో ప్రతి ఓటునూ కాపాడుకోవాలి

స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌లో ప్రతి ఓటునూ కాపాడుకునేలా పార్టీ నాయకులు, కౌంటింగ్‌ ఏజెంట్లు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ స

కౌంటింగ్‌లో ప్రతి ఓటునూ కాపాడుకోవాలి
స్థానిక సంస్థల ఎన్నికల కౌంటింగ్‌లో ప్రతి ఓటునూ కాపాడుకునేలా పార్టీ నాయకులు, కౌంటింగ్‌ ఏజెంట్లు పూర్తి అప్రమత్తతతో వ్యవహరించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి సూచించారు. నవంబర్‌ 3l జరిగే కౌంటింగ్‌తో పాటు ఈ నెల 5న జరగనున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా నిరుత్సాహపడకుండా, ప్రతి ఓటును, ప్రతి స్థానాన్ని కీలకంగా భావించి పోరాడాలని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార టీడీపీ వ్యవహరిస్తున్న తీరుతో పాటు కౌంటింగ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో గరిష్ట స్థాయిలో పోటీ జరిగేలా చూడాల్సిన అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో అనేక చోట్ల గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎంపీటీసీ అభ్యర్థులు లేకుండా ఎంపీటీసీ ఎన్నికలు, మరికొన్ని చోట్ల జెడ్పీటీసీ అభ్యర్థులు లేకుండా జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు.
Scroll for the next article