News17th Aug 12:03 PMSunil Byrisetty1 min read

వృద్ధులను ఆదరిద్దాం..!

వృద్ధులను ఆదరించవలసిన బాధ్యత అందరిపై ఉందని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు వల్లూరు వెంకటేశ్వర్లు అన్నారు. ఏ.పి.యూ.డబ్ల్యూ. జే. 69వ ఆవిర్భావ దినోత్సవ స

వృద్ధులను ఆదరిద్దాం..!
వృద్ధులను ఆదరించవలసిన బాధ్యత అందరిపై ఉందని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కోశాధికారి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు వల్లూరు వెంకటేశ్వర్లు అన్నారు. ఏ.పి.యూ.డబ్ల్యూ. జే. 69వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆదివారం నెల్లూరు బాలాజీ నగర్ గీతామయి వృద్ధుల ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే మాట్లాడుతూ వృద్ధులను ఆత్మీయంగా పలకరించాలని, వారిని ఆదరించాలని ఆయన కోరారు. భారతదేశంలో విదేశీ నాగరికతను పెరిగి తల్లిదండ్రులని వృద్ధాశ్రమాలకు పంపడం బాధాకరమన్నారు. అలాంటి సంఘటనలను దూరం చేయాలని ఈ రోజున వృద్ధులను సత్కరించి వారికి ఫలహారాన్ని అందజేయడం జరిగిందన్నారు. వృద్ధులను ఆదరించడం ప్రతిఒక్కరి బాధ్యత అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వృద్ధులను చీర శాలువా పూలదండలతో సత్కరించడం జరిగింది. అందరికీ ఫలహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిల్ మెంబర్ జయప్రకాష్, ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి హనుకు సీనియర్ ఫోటోగ్రాఫర్స్ డిటి హరికృష్ణ ఫోటో గ్రాఫర్ విభాగ జిల్లా అధ్యక్షులు మాల్యాద్రి మురళీ, స్వర్ణసింగ్. ఆశ్రమ నిర్వాహకుడు పాండు తదితరులు పాల్గొన్నారు
Andhra Pradesh
Elderly Care
Social Responsibility
APUWJ 69th Anniversary
Nellore Events
Venkateswarlu Speech
Senior Citizens Welfare
Balaji Nagar Old Age Home
Respect for Parents
వృద్ధుల సంరక్షణ
వృద్ధులను ఆదరిద్దాం
Scroll for the next article