Politics13th Mar 05:45 PMSunil Byrisetty1 min read
జనసేన ఆవిర్భావ సభకు సర్వం సిద్ధం
పిఠాపురంలో శుక్రవారం జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా చేపడుతున్నారు. శుక్రవారం సాయంత్రం 3.30 గంటల నుంచి స
పిఠాపురంలో శుక్రవారం జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభకు సర్వం సిద్ధమైంది.
మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా చేపడుతున్నారు.
శుక్రవారం సాయంత్రం 3.30 గంటల నుంచి సభ మొదలు కానుంది.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేయనున్నారు.
సభకు ఇప్పటికే జయకేతనం అనే పేరును ప్రకటించారు. సభ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా జనసైనికులు తరలి రానున్నారు.
అందుకోసం 1600 మంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
ఆహారం, మంచినీరు అందరికీ అందేలా చర్యలు చేపట్టామని అన్నారు.
సభా స్థలంలో 12 అంబులెన్సులు, మెడికల్ బృందాలను సిద్ధం చేశామన్నారు.
మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు, సౌకర్యాలు ఏర్పాటు చేశామని వివరించారు.
సభలో జనసేన ప్రారంభం, ప్రస్థానం, రాబోయే రోజుల్లో అనుసరించే వ్యూహాలపై పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.