Spiritual19th Jan 02:16 PMSunil Byrisetty1 min read

పూజా మండపాలను తనిఖీ చేసిన దుర్గగుడి ఈవో

విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి (వీకే శీనా నాయక్, ఆలయంలోని వివిధ పూజా కార్యక్రమాల నిర్వహణను, వాటికి వినియోగించే పూజ మండపాలను సోమవారం తన

పూజా మండపాలను తనిఖీ చేసిన దుర్గగుడి ఈవో
విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి (వీకే శీనా నాయక్, ఆలయంలోని వివిధ పూజా కార్యక్రమాల నిర్వహణను, వాటికి వినియోగించే పూజ మండపాలను సోమవారం తనిఖీలు చేశారు. శ్రీ అమ్మవారికి నిర్వహించే శ్రీ చక్ర అర్చన మండపాన్ని పరిశీలించి, అర్చకులు సేవలో వినియోగించే విధానాన్ని తెలుసుకున్నారు. లక్ష కుంకుమార్చన జరిగే ప్రదేశాన్ని, పూజా ద్రవ్యాల నాణ్యతను తనిఖీ చేశారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన చండీ హోమం నిర్వహించే యాగశాలను పరిశీలించి, హోమ ద్రవ్యాలను తనిఖీ చేశారు. అష్టోత్తర సహస్ర కుంకుమ పూజలు జరిగే మండపాలలో ఏర్పాట్లను, భక్తులకు అందించే ప్రసాదాలను సమీక్షించారు.
Andhra Pradesh
Vijayawada
Sri Durga Malleswara Swamy Temple
Executive Officer
Puja Mandapams
Chakra Archana
Kumkumarchana
యాగశాల
భక్తుల ప్రసాదం
ఆలయ నిర్వహణ
పూజా తనిఖీ
Scroll for the next article