Politics18th Mar 06:14 PMSunil Byrisetty2 min read

పవన్ కల్యాణ్‌పై మాజీ ఐఏఎస్ పంచులు!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పుట్టుక, రాజకీయ ప్రస్థానం సహా చెప్పే అన్ని మాటల్లో నిలకడ, పొంతన లేవని మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. మన మాటలను బట్టే ప్రజలు ఏ విధంగా అర్థం చేస

పవన్ కల్యాణ్‌పై మాజీ ఐఏఎస్ పంచులు!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పుట్టుక, రాజకీయ ప్రస్థానం సహా చెప్పే అన్ని మాటల్లో నిలకడ, పొంతన లేవని మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. మన మాటలను బట్టే ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకుంటారనేది లేకుండా ఎన్నికల ముందు ఒక రకంగా, ఎన్నికల తర్వాత మరో రకంగా మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. చేగువేరా ఆదర్శమని ఒకసారి, వివేకానందుడని మరోసారి చెప్పి నవ్వులపాలవుతున్నారన్నారు. మొదట కమ్యూనిజం ఆదర్శమని చెప్పారు, తర్వాత బీఎస్పీ మాయావతికి పాదాభివందనం చేశారు. తర్వాత బీజేపీ పంచన చేరారు. ఇలా నిలకడలేనితనం ఉన్న పవన్ కల్యాణ్ ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని సూటిగా ప్రశ్నించారు. తనకు కులం లేదని, మతం లేదని చెప్పుకొన్న పవన్ కల్యాణ్ తన భార్య బాప్తిజం తీసుకుందని, తన కుమార్తె క్రైస్తవం అనుసరిస్తుందని చెబితే క్రైస్తవులంతా ఓట్లేశారని గుర్తు చేశారు. తర్వాత తాను కాపునని, కాపులంతా ముందుకొచ్చి పిఠాపురంలో గెలిపించాలని అడిగి ఓట్లేయించుకుని గెలిచారు. మరి సోషలిజం, కమ్యూనిజం, హేతువాదం ఏమైపోయాయని, హఠాత్తుగా హిందూత్వం ఎందుకొచ్చిందని నిలదీశారు. సెక్యులర్ నని చెప్పుకొని క్రిస్టియన్లు, ముస్లింల ఓట్లు వేయించుకుని, ఇప్పుడు వారికి ఏమైనా జరిగితే ఊరుకుంటారా అని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఇంత చిన్న వయసులో ఇన్ని యూటర్నులు తీసుకున్న రాజకీయ పార్టీ మరొకటి లేదన్నారు. రాజకీయ పార్టీలు ఇలా చేస్తుంటే ప్రజలే ఆలోచించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అన్ని మతాలను గౌరవిస్తారని, అలాంటి ప్రజలు మత రాజకీయాలు చేయడాన్ని సహించరని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీగా కోరుతున్నామని విజయ్ కుమార్ చెప్పారు. మైనార్టీలు ఎక్కడైనా రక్షణ కోరుకుంటారని, పవన్ మాత్రం మెజార్టీ పక్షాన భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడుతున్నారన్నారు. 30 వేల మంది మిస్సయ్యారని చెప్పిన పవన్ ఉపముఖ్యమంత్రిగా ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. వాలంటీర్లకు పది వేలిస్తామని హామీ ఇచ్చి, వారిని తొలగించడమేంటన్నారు. కులం లేదు, కుటుంబం లేదని సొంత అన్నకు ఎమ్మెల్సీ ఇవ్వడం నెపొటిజం, ఫేవరిటజం కాదా అని ప్రశ్నించారు. మూడు భాషల పేరుతో ఉత్తరాది భాష హిందీని రుద్దుతుంటే గతంలో వ్యతిరేకించిన పవన్ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని విజయ్ కుమార్ నిలదీశారు. ఇకనైనా పవన్ ఆత్మావలోకనం చేసుకోవాలని సూచించారు.
Janasena
Pawankalyan
EX IAS VijayKumar
జనసేన
పవన్ కళ్యాణ్
మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్
Scroll for the next article