News15th Apr 12:05 PMSunil Byrisetty1 min read
విమానంలో వైద్యం.. ప్రాణాలు కాపాడిన మల్లారెడ్డి కోడలు
బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డా. ప్రీతి రెడ్డి తీసుకున్న చొరవ ఓ వృద్ధుడి ప్రాణం నిలబెట్టింది. ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ 74 ఏళ్ల వృద్ధుడు అర్థరాత్రి మూర్చపోయారు. నో
బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు డా. ప్రీతి రెడ్డి తీసుకున్న చొరవ ఓ వృద్ధుడి ప్రాణం నిలబెట్టింది.
ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ 74 ఏళ్ల వృద్ధుడు అర్థరాత్రి మూర్చపోయారు.
నోట్లో నుండి ద్రవం కారుతూ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
వెంటనే స్పందించిన డాక్టర్ ప్రీతి రెడ్డి విమానంలోనే సీపీఆర్ చేశారు.
దీంతో వృద్ధుడి ప్రాణాలు నిలబెట్టినట్లయింది.
బీపీ తక్కువగా ఉందని నిర్ధారణకు వచ్చి వెంటనే సీపీఆర్ చేసి, అవసరమైన ప్రథమ చికిత్స అందించారు.
విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎయిర్ పోర్ట్ సిబ్బంది వృద్ధుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
డా. ప్రీతి చొరవపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి