Politics8th Jul 02:12 PMSunil Byrisetty1 min read
వైసిపి నేత ప్రసన్న వాఖ్యలు దారుణమన్న పవన్
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మపై వైసిపి మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలు బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరె
నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మపై వైసిపి మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వాఖ్యలు బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి ఆయన సంఘీభావం ప్రకటించారు. రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప వ్యక్తిగత దూషణలు తగవన్నారు. మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి ప్రసన్న మాట్లాడిన మాటలు సంస్కార రహితంగా ఉన్నాయన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడైన ప్రసన్న చేసిన దిగజారుడు వాఖ్యలు ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. సభ్యతా సంస్కారాలు లేని ప్రసన్నలాంటి నాయకులను రాజకీయాల నుంచి బహిష్కరించాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.