News31st Jan 04:14 PMSunil Byrisetty1 min read
విద్యార్థులకిది కీలక సమయం
పరీక్షలు సమీపిస్తున్న సమయంలో విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయమని ధైర్యంగా పరీక్షలను ఎదురుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ విద్యార్థులకు సూచించ
పరీక్షలు సమీపిస్తున్న సమయంలో విద్యార్థులకు అత్యంత కీలకమైన సమయమని ధైర్యంగా పరీక్షలను ఎదురుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి లక్ష్మీశ విద్యార్థులకు సూచించారు. మార్చి 16న 10వ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యార్థులతో కలెక్టర్ ముచ్చటించారు. పాఠ్యాంశాలపై పలు ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి సమాధానాలను రాబట్టారు. విద్యార్థులు ఏ విషయాన్ని చదువుతున్నా 360 డిగ్రీ కోణంతో అధ్యయనం చేయాలని సూచించారు. అప్పుడే నేర్చుకున్న విషయాలు పరీక్షలకే పరిమితం కాకుండా జీవితాంతం గుర్తుంటాయన్నారు. విద్యార్థి జీవితాన్ని మలుపు తిప్పేది పదవ తరగతి పరీక్షలేనని పదవ తరగతి పరీక్ష పాస్ అయితే ఉన్నత చదువులు చదివేందుకు మార్గం సుగమం అవుతుందన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థి పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా కృషిచేయాలన్నారు. సబ్జెక్టు ఉపాధ్యాయులు ఆయా సబ్జెక్టులలో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టిపెట్టి వారికి అర్ధమయ్యే రీతిలో బోధించి పరీక్షలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం చేయాలన్నారు.