News17th Oct 06:00 PMSunil Byrisetty1 min read

ఎక్సైజ్ అధికారులు నిజాయితీతో విధులు నిర్వహించాలి

ఎక్సైజ్ శాఖలో నూతనంగా నియమితులైన అధికారులు నిజాయతీ, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని రెవెన్యూ (ఎక్సైజ్), గనులు, భూగర్భశాఖల ము

ఎక్సైజ్ అధికారులు నిజాయితీతో విధులు నిర్వహించాలి
ఎక్సైజ్ శాఖలో నూతనంగా నియమితులైన అధికారులు నిజాయతీ, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని రెవెన్యూ (ఎక్సైజ్), గనులు, భూగర్భశాఖల ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా పిలుపునిచ్చారు. నిషేధ, ఎక్సైజ్ చట్టాలను సమర్థ వంతంగా అమలు చేస్తూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌సాగర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో ఆరు నెలల పాటు ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మీనా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, విధుల నిర్వహణలో జవాబుదారీతనం, వృత్తి నైపుణ్యాన్ని పాటించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ చామకూరి శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాఖ పనితీరును మరింత మెరుగుపరచడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ చట్టాలను సమర్థంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.
Scroll for the next article