Politics23rd Oct 02:26 PMSunil Byrisetty1 min read

ఉద్యోగుల అంశంపై మాజీ సీఎం జగన్ సీరియస్!

ఉద్యోగుల విషయంలో చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తుందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.. తాజాగా ఆయన మీడియా సమావేశంలో ప్రసంగించారు. సీఎం సీట్లోకి చంద్రబాబు వచ్చి 18 నెలలు అయ్యిందని గుర్తు

ఉద్యోగుల అంశంపై మాజీ సీఎం జగన్ సీరియస్!
ఉద్యోగుల విషయంలో చంద్రబాబు పిల్లిమొగ్గలు వేస్తుందని మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు.. తాజాగా ఆయన మీడియా సమావేశంలో ప్రసంగించారు. సీఎం సీట్లోకి చంద్రబాబు వచ్చి 18 నెలలు అయ్యిందని గుర్తు చేశారు. పెండింగ్ లో నాలుగు డీఏలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు ఒక్క డీఏ ఇవ్వలేదు. ఉద్యోగులు రోడ్డెక్కితే ఒక్కటి ఇస్తా అన్నాడు కానీ ఇవ్వలేదు. మళ్ళీ నవంబర్ అంటున్నారని విమర్శించారు.. డీఏ అరియర్స్ కూడా రిటైర్డ్ అయ్యాక ఇస్తామన్నారని.. చరిత్రలో ఇలా ఎప్పుడు జరగలేదన్నారు. కోవిడ్ లాంటి కష్ట సమయంలో 10 ఇవ్వాల్సి ఉన్నా కూడా 11 డీఏలు ఇచ్చామని గుర్తు చేశారు. ఉద్యోగుల విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నారు. అప్పుడే ప్రతీ ఉద్యోగి తిట్టడం మొదలు పెట్టారని మాజీ సీఎం జగన్ అన్నారు. వాళ్ళు తిట్టడం మొదలు పెట్టడంతో సరిచేస్తాం అన్నారు కానీ ఇంకా కొత్తది ఇవ్వలేదని విమర్శించారు. పోలీసులకు సరెండర్ లీవ్స్ సొమ్ము కూడా ఇవ్వకుండా పండగ చేసుకో అంటున్న చంద్రబాబు.. ఎన్నికల సమయంలో అరచేతిలో వైకుంఠం చూపారన్నారు. ఉద్యోగుల గౌరవాన్ని పెంచుతాం అన్నారు వారిని నిలువునా మోసం చేశారని వెల్లడించారు. ఎన్నికల ముందు ఓపీఎస్ అని నమ్మబలికారన్నారు.. ఇప్పుడు జీపీఎస్ లేదు.. ఓపీఎస్ లేదు.. వాళ్ళను త్రిశంకు స్వర్గంలో పెట్టారని ఆరోపించారు.
YS Jagan
Chandrababu Andhra Pradesh
Political Criticism
Naidu
Employee Rights
DA Arrears
Public Sector Employees
Government Employees
ఉద్యోగుల హక్కులు
డీఏ పెండింగ్
పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులు
Scroll for the next article