News1st Nov 12:29 PMSunil Byrisetty1 min read
ఇదే అసలైన టీమ్ స్పిరిట్ – టీమ్ వర్క్
మొంథా తుఫాన్‌ను టీమ్ స్పిరిట్‌తో సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపైనా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సైక్లోన్ మొంథా ఫైటర్ల అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
మొంథా తుఫాన్‌ను టీమ్ స్పిరిట్‌తో సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని, ఇకపైనా ఇదే స్ఫూర్తి కొనసాగించాలని సైక్లోన్ మొంథా ఫైటర్ల అభినందన కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో మొంథా తుఫాను సమయంలో విశేష ప్రతిభ కనబరిచిన 137 మందికి మెమొంటోలు, సర్టిఫికెట్లను సీఎం అందించారు. ప్రతీ సంక్షోభం మనకు ఒక అవకాశం.. ఈసారి తుఫాన్ నష్టాన్ని తగ్గించగలిగిన రాష్ట్రంలోని ప్రతీ ఒక్కరికీ ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో అద్భతంగా పనిచేశారని కితాబిచ్చారు. ఈ సైక్లోన్ అనుభవాన్ని మున్ముందు విపత్తుల కార్యాచరణ కోసం మాన్యువల్‌గా రూపొందిద్దామని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అందరినీ సమన్వయ పరుచుకుంటూ ముందుకెళ్తుందనే దానికి ఫలితంగానే మొంథా తుఫాన్ నష్టాన్ని తగ్గించగలిగామని ముఖ్యమంత్రి అన్నారు. ‘రాష్ట్రానికి రెండు సమస్యలు ఉన్నాయి... ఒకటి రాయలసీమకు కరువు, రెండోది కోస్తాంధ్రకు తుఫాన్లు. సమర్ధ నీటి నిర్వహణతో, ప్రాజెక్టుల నిర్మాణంతో ఈరోజు రాయలసీమలో కరువు అనేది లేకుండా చేశాం. గతంలో హరికేన్ వచ్చింది.. ఉభయ గోదావరి జిల్లాల్లో అప్పుడు వారం నుంచి 10 రోజుల్లో సాధారణ పరిస్థితులు తీసుకురాగలిగాం. ఈసారి మొంథా తుఫాన్ ఎదుర్కొనేందుకు ప్రతిభ కనబరిచే అధికారులతో ఒక టీమ్‌ను సిద్ధం చేశాం. వారంతా అద్భుతంగా పనిచేశారు..' అని ముఖ్యమంత్రి అన్నారు.