Politics8th Sep 06:19 PMSunil Byrisetty1 min read
ఆలయ భూములనూ వదలరా?
ముఖ్యమంత్రి భూబకాసురుడుగా మారాడని, ఆఖరికి ఆలయ భూములను సైతం వదలకుండా అయిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్స
ముఖ్యమంత్రి భూబకాసురుడుగా మారాడని, ఆఖరికి ఆలయ భూములను సైతం వదలకుండా అయిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం గొడుగుపేట వేంకటేశ్వరస్వామికి చెందిన రూ.400 కోట్ల విలువైన ఆలయ భూములను ఎగ్జిబిషన్ గ్రౌండ్, గోల్ఫ్ క్లబ్ల ముసుగులో కావాల్సిన వారికి దారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూసమాజం సహించదని హెచ్చరించారు. ఆలయ భూములను కాజేసేందుకు రాత్రికి రాత్రే చదును చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం దారుణమని అన్నారు. చంద్రబాబు అండతో, ఎంపీ చేస్తున్న దురాగతాన్ని న్యాయపోరాటం ద్వారా అడ్డుకుంటామని స్పష్టం చేశారు.