Politics25th Jul 12:29 PMSunil Byrisetty1 min read
విజయసాయి రెడ్డికి షాక్!
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్ తగిలింది. భీమిలి సముద్రతీరంలోని అక్రమ నిర్మాణాలపై కేసు నమోదైంది. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, రోహిత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఏపీ కోస్టల్
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి షాక్ తగిలింది. భీమిలి సముద్రతీరంలోని అక్రమ నిర్మాణాలపై కేసు నమోదైంది. విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి, రోహిత్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఏపీ కోస్టల్ జోన్ మేనేజ్ మెంట్ అథారిటీ ఫిర్యాదు మేరకు కేసు.. పర్యావరణ చట్టం నిబంధనలు ఉల్లంఘించారని కేసులో పేర్కొన్నారు. జీవీఎంసీ మూడో డివిజన్ లోని సర్వే నెంబర్ 1516, 1517 లోని స్థలాలు, నిర్మాణాలు పరిశీలన చేయనున్నారు. సర్వే నెంబర్ 1518, 1519, 1522 స్థలాలు, నిర్మాణాలను కమిటీ పరిశీలించనుంది. ఇప్పటికే ఈ స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలను జీవీఎంసీ కొంతమేర తొలగించింది. ఇటీవల భీమిలి కోర్టు ఆదేశాల మేరకు పోలీసు స్టేషన్ లోనూ కేసు నమోదు చేశారు.