Education18th Apr 09:28 AMSunil Byrisetty1 min read

జిల్లాకో ఐటీ మేనేజర్.. ఏపీ ప్రభుత్వం జీవో

ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ శాఖ ద్వారా ప్రతి జిల్లాల్లో ఐటీ టెక్నాలజీ సేవలు పునర్నిర్మాణం, విస్తరణ కోసం జిల్లాకు ఒక ఐటీ మేనేజర్‌ను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసుకోవడానికి ప్ర

జిల్లాకో ఐటీ మేనేజర్.. ఏపీ ప్రభుత్వం జీవో
ఐటీ, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ శాఖ ద్వారా ప్రతి జిల్లాల్లో ఐటీ టెక్నాలజీ సేవలు పునర్నిర్మాణం, విస్తరణ కోసం జిల్లాకు ఒక ఐటీ మేనేజర్‌ను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. B.Tech/ M.sc (కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలెక్ట్రానిక్, ఎలక్ట్రికల్) రంగాల్లో 3 సం.ల అనుభవం ఉండాలి. జీతం: నెలకు 40 వేలు చెల్లిస్తారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కార్యాలయాల్లో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, నెట్‌వర్క్‌లతో సహా ఐటీ మౌలిక సదుపాయాలను నిర్వహించడం ఉంటాయి. కలెక్టరేట్, దాని సబార్డినేట్ కార్యాలయాలలో IT వ్యవస్థలు, అప్లికేషన్లను అమలు చేయడం విధులు. వినియోగదారులకు టెక్నికల్ సపోర్ట్ అందించడం, IT వ్యవస్థలు, డేటా భద్రతను నిర్ధారించాలి. జిల్లా స్థాయిలో ITE&C విభాగం IT ప్రాజెక్ట్‌లను ప్లాన్ చేయడం, అమలు చేయడం. జిల్లాలో వెబ్‌నార్లు, వర్క్‌షాప్‌లు, వాణిజ్య ప్రదర్శనలు వంటి ఐటీ సంబంధిత ఈవెంట్‌ల ప్రణాళిక అమలు. IT ప్రమోషన్లు, ప్రచారాలు కార్యక్రమాల ప్రణాళిక అమలు చేయడం వంటివి విధులుగా ఉంటాయి.
Andhra Pradesh Technology Services
APTS in the Districts
ఐటీ
ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ శాఖ
ఐటీ మేనేజర్‌ను కాంట్రాక్ట్
Scroll for the next article