News28th Sep 04:48 PMSunil Byrisetty1 min read

తుఫాన్ ప్రభావిత పంట నష్టాల ఎన్యుమరేషన్‌

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.

తుఫాన్ ప్రభావిత పంట నష్టాల ఎన్యుమరేషన్‌
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు జరిగిన నష్టానికి సంబంధించిన ఎన్యుమరేషన్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. తుఫాన్ కారణంగా పంటలకు జరిగిన నష్టంపై అందిన ప్రాథమిక నివేదికలు, ఇప్పటివరకు జరిగిన ఎన్యుమరేషన్ పురోగతిని మంత్రి సమీక్షించారు. తుఫాన్ ప్రభావంతో వివిధ జిల్లాల్లో వ్యవసాయ, ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాస్తవ నష్టాన్ని పక్కాగా గుర్తించడం అత్యంత ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. బాధిత రైతుల వివరాల నమోదులో ఎలాంటి లోపాలకు తావులేకుండా, ప్రతి రైతు పంట నష్టాన్ని సమగ్రంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యానవన శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలోని 14 జిల్లాల్లో 89 మండలాలు, 351 గ్రామాల్లో ఉద్యానవన పంటలు ప్రభావితమయ్యాయి. మొత్తం 1,734 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతినగా, 5,777 మంది రైతులు పంట నష్టానికి గురైనట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇప్పటివరకు 445 హెక్టార్లకు సంబంధించి 950 మంది రైతుల పంట నష్టం ఎన్యుమరేషన్‌ను పూర్తి చేశారు. ఇంకా 1,289 హెక్టార్లకు సంబంధించిన పంట నష్టం వివరాలను నమోదు చేయాల్సి ఉందని అధికారులు మంత్రికి వివరించారు.
Scroll for the next article