News30th Jan 02:52 PMSunil Byrisetty1 min read

ఏపీ బడ్జెట్‌ సమావేశాలు.. వారిపై వేటు తప్పదా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గతంలో ఎప్పుడూ లేని విధంగా నెలరోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 12న ప్రారంభమయ్యే సమావేశాలు మార్చి 12 వరకు కొనసాగేలా

ఏపీ బడ్జెట్‌ సమావేశాలు.. వారిపై వేటు తప్పదా?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గతంలో ఎప్పుడూ లేని విధంగా నెలరోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 12న ప్రారంభమయ్యే సమావేశాలు మార్చి 12 వరకు కొనసాగేలా ప్రణాళిక రూపొందించారు. ఈ సుదీర్ఘ సమావేశాల వెనుక కేవలం పాలనా అవసరాలే కాకుండా రాజకీయ వ్యూహం కూడా దాగి ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అసెంబ్లీని ఎక్కువ రోజులు కొనసాగించడం ద్వారా కొన్ని కీలక నిర్ణయాలకు మార్గం సుగమం చేయాలన్న ఉద్దేశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల గైర్హాజరు అంశం ఈ సమావేశాల్లో ప్రధాన చర్చగా మారే అవకాశం ఉంది. రాజ్యాంగంలోని నిబంధనల ప్రకారం, ఒక శాసనసభ్యుడు వరుసగా 60 పని దినాలు సభకు హాజరు కాకపోతే అతడిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు ఈసారి కూడా సభకు రాకపోతే ఆ నిబంధన వర్తించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Andhra Pradesh Assembly
AP Budget Sessions
YSRCP MLAs
Political Strategy
Assembly Proceedings
Budget Session 2025
శాసనసభ
ఎమ్మెల్యే అనర్హత
ప్రతిపక్ష రాజకీయాలు
Scroll for the next article