News7th Dec 12:48 PMSunil Byrisetty1 min read

ఏయూ మాజీ వీసీకి నెల రోజుల జైలు

ఆంధ్రా యూనివర్సిటీ బోటనీ విభాగంలో 17 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నూకన్న దొరను 2022లో విధుల నుంచి తొలగించారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా, తిరిగి విధుల్లోకి తీ

ఏయూ మాజీ వీసీకి నెల రోజుల జైలు
ఆంధ్రా యూనివర్సిటీ బోటనీ విభాగంలో 17 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న నూకన్న దొరను 2022లో విధుల నుంచి తొలగించారు. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని 2023 మార్చిలో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, అప్పటి వీసీ ప్రసాదరెడ్డి ఈ ఆదేశాలను అమలు చేయలేదు. దీంతో నూకన్నదొర కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు.. ప్రసాదరెడ్డి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని నిర్ధారించారు. దీంతో జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ప్రసాదరెడ్డి తరఫు న్యాయవాది అభ్యర్థన మేరకు.. అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును ఆరు వారాల పాటు సస్పెండ్ చేసింది. ఈ లోగా అప్పీల్‌లో స్టే రాకపోతే, డిసెంబర్ 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు హైకోర్టు రిజిస్ట్రార్ ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది.
Andhra University
Vice Chancellor
High Court
Contempt of Court
Education News
Legal Update
Court Orders
University Issues
Scroll for the next article