News19th Jun 12:21 PMSunil Byrisetty1 min read
దేశవ్యాప్తంగా అంగన్వాడీల్లో ఫేషియల్!
దేశంలోని అన్ని అంగన్వాడీల్లో ఆహార పంపిణీ సమయంలో ముఖ గుర్తింపు సాధనాలతో లబ్దిదారులను ధ్రువీకరించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ఆదేశించి
దేశంలోని అన్ని అంగన్వాడీల్లో ఆహార పంపిణీ సమయంలో ముఖ గుర్తింపు సాధనాలతో లబ్దిదారులను ధ్రువీకరించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర మహిళా, శిశు సంక్షేమశాఖ ఆదేశించింది. జూలై 1 నుంచి ఈ పద్ధతి అమల్లోకి రానుంది. అదే తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో 3-6 ఏళ్ల బాలల్లో ఎంతమంది ఆహారం తీసుకుంటున్నారో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంది. పోషణ్ ట్రాకర్ ద్వారా ముఖ గుర్తింపు సాధనం అందుబాటులోకి వస్తుంది. ఈ-కేవైసీ, సొంత ఫొటో ద్వారా లబ్దిదారులు తమకు తాముగా నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 1 నుంచి కొత్త లబ్దిదారుల రిజిస్ట్రేషన్‌కు ముఖ గుర్తింపు తప్పని సరి కానుంది.