News16th Jan 12:27 PMSunil Byrisetty1 min read
సచివాలయ సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సమయపాలనపై కఠిన నిబంధనలు అమలు చేయనుంది. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇకపై విధులకు కచ్చితమైన సమయానికి హాజరుకావ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సమయపాలనపై కఠిన నిబంధనలు అమలు చేయనుంది.
ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇకపై విధులకు కచ్చితమైన సమయానికి హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆలస్యంగా వస్తే ఆ రోజు వేతనంలో కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ సంస్కరణల ద్వారా సచివాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని సర్కార్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.