Telangana1st Aug 11:55 AMSunil Byrisetty1 min read
ప్రభుత్వ పాఠశాలల్లో ఫేషియల్ తప్పనిసరి
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఇక ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం) హాజరు అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఈఓలు ఆయా ఎంఈఓలు, హె
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు ఇక ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం) హాజరు అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఈఓలు ఆయా ఎంఈఓలు, హెచ్‌ఎంలను ఆదేశించారు. గత ఏడాది ఫిబ్రవరినుంచి రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా టీచర్ల ముఖగుర్తింపు హాజరును అమలు చేస్తున్నారు. అక్కడ విజయవంతం కావడంతో నేటి(శుక్రవారం)నుంచి రాష్ట్రవ్యాప్తంగా, హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, యూఆర్‌ఎస్, టీజీఆర్‌ఈఐఎస్‌లలో అమలు చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే విద్యార్థులకు ముఖ గుర్తింపు హాజరు తీసుకుంటున్నారు. అందుకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ యాప్‌ను వినియోగిస్తున్నారు. ఇదే యాప్ ద్వారా హెచ్‌ఎంలు, టీచర్ల, నాన్ టీచింగ్ ఉద్యోగుల ముఖ గుర్తింపు హాజరు అమలుచేయనున్నారు. హెచ్‌ఎంలు తమ సెల్‌ఫోన్‌లోని డీఎస్‌ఈ యాప్‌లో టీచర్ మా డ్యూల్ టీచర్లకు, నాన్‌టీచింగ్ మాడ్యూల్‌లో నాన్‌టీచింగ్ సిబ్బందికి రిజిస్ట్రేషన్ చేయాలి. ఫొటో తీసి వారి వివరాలు, పాఠశాల సమయం తదితర వివరాలు అప్‌లోడ్ చేయాలి.