Crime24th Nov 12:59 PMSunil Byrisetty1 min read

క్యాష్ కొడితే.. బోగస్ సర్టిఫికెట్లు

డబ్బు ఇస్తే బోగస్ సర్టిఫికెట్లు ఇస్తున్న ముఠా వ్యవహారం బట్టబయలైంది. నకిలీ సర్టిఫికెట్లు అమ్ముతున్న ఐదుగురు సభ్యుల ముఠాను నార్సింగి పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. న

క్యాష్ కొడితే.. బోగస్ సర్టిఫికెట్లు
డబ్బు ఇస్తే బోగస్ సర్టిఫికెట్లు ఇస్తున్న ముఠా వ్యవహారం బట్టబయలైంది. నకిలీ సర్టిఫికెట్లు అమ్ముతున్న ఐదుగురు సభ్యుల ముఠాను నార్సింగి పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించారు. నార్సింగి పోలీసులు నకిలీ సర్టిఫికెట్లను కస్టమర్లకు ఇవ్వడానికి వచ్చిన ఐదుగురు వ్యక్తుల ముఠా ను అరెస్టు చేశారు. వారి నుంచి ఎస్ ఆర్ ఎం యూనివర్సిటీ, బెంగళూరు సిటీ యూనివర్సిటీ పేర్లతో ఉన్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లు, మెమోలు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు, బోనాఫైడ్ సర్టిఫికెట్లు, ఇతర నకిలీ రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ సర్టిఫికెట్ల తయారీ, ముద్రణ, విక్రయం తదితర కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు నిందితుల విచారణలో అంగీకరించారు. ప్రధాన నిందితుడు మీర్జా అక్తర్ అలీ బైగ్ అలియాస్ అస్లాం కాగా, సర్టిఫికెట్ల కు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న మహ్మద్ అజాజ్ అహ్మద్తో పాటు మూడో నిందితుడు వడ్డేపల్లి వెంకట్ సాయిని పట్టుకున్నారు. వీరితోపాటు నకిలీ సర్టిఫికెట్ల కొనుగోలుదారుడైన విస్టాలా రోహిత్ కుమార్, నకిలీ సర్టిఫికెట్ల కొనుగోలుదారు బీటెక్ సర్టిఫికెట్ కొనుగోలుదారుడైన సత్తూరి ప్రవీణ్ ను అరెస్ట్ చేశారు.
Hyderabad Crime
Narsingi Police
Fake Certificates
Certificate Racket
SRM University
Bangalore City University
Fraud Arrest
Fake Degree Scam
Bogus Certificates
Education Scam
Mirza Akhtar Ali Baig
Mohammed Ajaz Ahmed
Scroll for the next article