TTD29th Nov 12:12 PMSunil Byrisetty1 min read

లక్షల డబ్బు, వెండి నాణేల కోసం కల్తీ నెయ్యి

శ్రీవారి లడ్డూ తయారీ నెయ్యిలో కీలక అప్డేట్ వచ్చింది. ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వ్

లక్షల డబ్బు, వెండి నాణేల కోసం కల్తీ నెయ్యి
శ్రీవారి లడ్డూ తయారీ నెయ్యిలో కీలక అప్డేట్ వచ్చింది. ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో టీటీడీ కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్‌గా పనిచేసిన ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ధారించింది. అర్హత లేని డెయిరీ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఆయన లక్షల్లో లంచాలు తీసుకున్నారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో అరెస్టయిన సుబ్రహ్మణ్యం ప్రస్తుతం టీటీడీలో ఈఈగా పనిచేస్తున్నారు. సిట్ విచారణ ప్రకారం, సుబ్రహ్మణ్యం 2021 జులై నుంచి 2023 నవంబర్ మధ్య కాలంలో పలుమార్లు లంచాలు స్వీకరించారు. భోలేబాబా, వైష్ణవి, మాల్గంగా వంటి డెయిరీ సంస్థల ప్రతినిధుల నుంచి రూ.3.50 లక్షల నగదు, రూ.50 వేల విలువైన శాంసంగ్ ఫోన్, రూ.16,700 విలువైన వెండి ప్లేటు, వెండి నాణేలు తీసుకున్నట్లు తేలింది. ఈ డెయిరీల ప్లాంట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయకుండానే, వాటికి అన్ని అర్హతలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం సభ్యుడిగా ఉన్న సాంకేతిక కమిటీ నివేదిక ఇచ్చింది. దీంతో ఆ సంస్థలకు సులభంగా కాంట్రాక్టులు దక్కాయి.
Andhra Pradesh
TTD
Tirumala
Laddu Scam
Ghee Scam
SIT Investigation
Corruption
Subrahmanyam
Dairy Contracts
Bribery
కాంట్రాక్టులు
సుబ్రహ్మణ్యం
డెయిరీ సంస్థలు
తిరుమల
Scroll for the next article