Crime23rd Aug 12:24 PMSunil Byrisetty1 min read
ఈగల్ పేరుతో ఫేక్ నోటిఫికేషన్
తెలంగాణలో మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు పని చేస్తున్న ఈగల్ (యాంటీ నార్కోటిక్స్ యూనిట్) సెల్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర తీశారు. ఈగల్ యాంటీ నార్కోటిక్స్ యూన
తెలంగాణలో మాదకద్రవ్యాలను నియంత్రించేందుకు పని చేస్తున్న ఈగల్ (యాంటీ నార్కోటిక్స్ యూనిట్) సెల్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెర తీశారు. ఈగల్ యాంటీ నార్కోటిక్స్ యూనిట్‌లో హోంగార్డుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పదో తరగతి పాసైన అభ్యర్థులు అర్హులని, నెలకు రూ.25 వేల నుంచి రూ.26 వేల వరకు జీతంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ప్రచారం చేశారు. సెప్టెంబర్ 9న జాయినింగ్ రిపోర్ట్ తరువాత 15 రోజులు ట్రైనింగ్ ఇస్తామని కేటుగాళ్లు పేర్కొన్నారు. కాగా.. ఇది పూర్తిగా అవాస్తవమని ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య స్పష్టం చేశారు. తెలంగాణ పోలీసు శాఖగానీ, ఈగల్ సెల్ నుంచిగానీ ఎలాంటి నోటిఫికేషన్ విడుదల చేయలేదని వెల్లడించారు.