News19th Jul 11:49 AMSunil Byrisetty1 min read
తిరుపతిలో నకిలీ పోలీస్ హల్చల్
తిరుపతిలో నకిలీ పోలీసు గుట్టును అసలు పోలీసులు రట్టు చేశారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విహా హోమ్ స్టే మేనేజర్ ను నకిలీ ఆర్ఎస్ఐ బెదిరించాడు. ఓ మహిళతో హోం స్టే కి చేరుకొని తాను
తిరుపతిలో నకిలీ పోలీసు గుట్టును అసలు పోలీసులు రట్టు చేశారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని విహా హోమ్ స్టే మేనేజర్ ను నకిలీ ఆర్ఎస్ఐ బెదిరించాడు. ఓ మహిళతో హోం స్టే కి చేరుకొని తాను పోలీస్ అంటూ ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్ కావాలనే డిమాండ్ చేశాడు. రూంలోకి వెళ్లి గంటలు గడిచినా తలుపు తట్టినా తీయకపోవడంతో అనుమానంవచ్చి మేనేజర్ పోలీసులకు సమాచారం తెలిపాడు. హోమ్ స్టే వద్దకు చేరుకున్న పోలీసులు నకిలీ పోలీసుగా గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పట్టుబడ్డ నకిలీ పోలీస్ గుంటూరు జిల్లాకు చెందిన, దాసరి కార్తీక్ గా గుర్తించి కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.