Spiritual24th Dec 11:54 AMSunil Byrisetty1 min read

బాబోయ్ బండరాళ్లు

శ్రీ పానకాల లక్ష్మీ నృసింహ స్వామి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు మార్గంలో తరచూ బండరాళ్లు జారిపడుతున్నాయి. దీంతో మంగళగిరి కొండపైకి ఘాట్ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగించే భక్తులు, వాహనదా

బాబోయ్ బండరాళ్లు
శ్రీ పానకాల లక్ష్మీ నృసింహ స్వామి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డు మార్గంలో తరచూ బండరాళ్లు జారిపడుతున్నాయి. దీంతో మంగళగిరి కొండపైకి ఘాట్ రోడ్డు మార్గంలో రాకపోకలు సాగించే భక్తులు, వాహనదారులు బండరాళ్లు ఎక్కడ తమపై పడిపోతాయోనని భయాందోళనకు గురి అవుతున్నారు. ఘాట్ రోడ్డు నిర్వహణా లోపంతో ప్రమాద భరితంగా తయారవడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్ రోడ్డు వెంబడి కొండకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే తమ ప్రాణాలను కాపాడిన వారవుతారని భక్తులు అంటున్నారు. కొండపై కార్లు పార్కింగ్ చేసే ప్రాంతంలో మురుగునీరు నిలిచి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. నిలిచిన మురుగునీరు పచ్చగా మారడంతో పాటు దోమలు పెరిగి వ్యాప్తి చెందుతోన్నాయి. దీంతో ఎగువ సన్నిధికి వచ్చే భక్తులు కొంత అసహనానికి గురి అవుతోన్నారు. ఎంతో పవిత్రమైన ఆలయం శ్రీ పానకాల లక్ష్మీ నృసింహ స్వామి ఆవరణలో ఇలాంటి అపరిశుభ్రమైన దృశ్యాలు కనిపించడం బాధాకరమని, అధికారులు స్పందించి శుభ్రతా చర్యలు చేపట్టాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
Andhra Pradesh
Panakala Lakshmi Narasimha Swamy Temple
Mangalgiri
Ghat Road Safety
Falling Boulders
Devotee Safety
Temple Maintenance
ఆలయ నిర్వహణ
ప్రజా భద్రత
శుభ్రత సమస్యలు
Scroll for the next article