Politics26th Nov 06:11 PMSunil Byrisetty1 min read
అరటి రైతుల పేరుతో అబద్ధాల ప్రచారం
కడప జిల్లాలో అరటి రైతుల పేరుతో మళ్లీ అబద్ధాల ప్రచారం ప్రారంభించిన జగన్ తీరు ప్రజలను మోసం చేసే మరో ప్రయత్నమే తప్ప వాస్తవాలతో ఎలాంటి సంబంధం లేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన
కడప జిల్లాలో అరటి రైతుల పేరుతో మళ్లీ అబద్ధాల ప్రచారం ప్రారంభించిన జగన్ తీరు ప్రజలను మోసం చేసే మరో ప్రయత్నమే తప్ప వాస్తవాలతో ఎలాంటి సంబంధం లేదని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఐదేళ్ల పాటు వ్యవసాయ రంగాన్ని అధ్వాన్న స్థితికి నెట్టిన జగన్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కామెడీగా ఉందన్నారు. జగన్ పాలనలోనే రైతులు వీధులపైకి వచ్చారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే ఏమిటో ఆయన ప్రభుత్వానికి తెలియదు. రైతులను ఆదుకోవాల్సిన ఆర్బీకేలను లంచాల గూళ్లుగా మార్చి అరటి, టమోటా, ఉల్లి వంటి పంటలను నేలమట్టం చేసిన ప్రభుత్వం జగన్‌దే అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రైతులకు సహాయపడేందుకు బలమైన చర్యలు చేపట్టిందన్నారు. ఉద్యాన శాఖ "ఫ్రూట్ కేర్" యాక్టివిటీ చేపడుతున్న ప్రతి రైతుకు ఎకరాకు రూ.10,000/− చొప్పున రాయితీ ప్రోత్సాహకాలు అందిస్తోందని చెప్పారు. నాణ్యమైన పంట పెంచేందుకు శిక్షణ కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తోంది. ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ స్వయంగా అనంతపురం, నంద్యాల, కడప జిల్లాలలో పర్యటించి పంట పరిస్థితిని సమీక్షించారని వివరించారు. ప్రభుత్వ ప్రతినిధులు ఢిల్లీలో బయ్యర్ అండ్ సెల్లర్స్ మీట్ నిర్వహించి దేశంలోని ప్రధాన మార్కెట్లతో ప్రత్యక్ష చర్చలు జరిపారని తెలిపారు. ఆజాద్పూర్ మండి, హర్యానా సోనిపట్ అగ్రిగేటర్లతో జరిగిన సమావేశాల్లో వచ్చే 10–15 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో కొనుగోలు ప్రారంభమవుతుందని కొనుగోలుదారులు హామీ ఇచ్చారు.