News23rd Aug 04:24 PMSunil Byrisetty1 min read

ఐ ఫోన్ కోసం లోయలో కుటుంబం బలి!

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. దేవలాయి ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల కునాల్ చాంద్‌గుడే అనే యువకుడు ఐఫోన్ కొనడానికి డబ్బులు ఇవ్వాలని తల్లి

ఐ ఫోన్ కోసం లోయలో కుటుంబం బలి!
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. దేవలాయి ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల కునాల్ చాంద్‌గుడే అనే యువకుడు ఐఫోన్ కొనడానికి డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులతో గొడవ పడ్డాడు. తండ్రి నిరాకరించడంతో సమీపంలోని 'ఖవడ్యా' కొండపైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. యువకుడు కొండ అంచులో నిలబడటంతో స్థానికులు, పోలీసులు, అతని తల్లిదండ్రులు 3 గంటల పాటు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొందరు స్థానికులు ఐఫోన్ 15 ప్రో కొనిస్తామని కూడా మాటిచ్చారు. అయినా మాట వినకపోవడంతో కుమారుడిని కాపాడటానికి తండ్రి మురళీధర్ చాంద్‌గుడే కొండ అంచువరకు వెళ్లి అతనిని వెనక్కి లాగడానికి ప్రయత్నించాడు. ఆ క్రమంలో యువకుడు గుంజుకోవడంతో ఇద్దరూ కొండపై నుంచి లోయలోకి పడిపోయారు. కళ్ల ముందే భర్త, కొడుకు లోయలో పడిపోవడం చూసిన తల్లి సంగీత షాక్ కి గురయ్యారు. కొద్ది క్షణాల్లో ఆమె కూడా అదే కొండపై నుంచి కిందకు దూకేసింది. ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒక ఫోన్ కోసం కుటుంబం బాలి కావడం అందర్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
Maharashtra
Chhatrapati Sambhajinagar
iPhone
Family Tragedy
Teen Suicide Threat
Tragic Incident
Hill Fall
Kunal Chandgude
ఆత్మహత్య బెదిరింపు
కునాల్ చాంద్‌గుడే
కుటుంబం మృతి
మహారాష్ట్ర వార్తలు
క్రైమ్ న్యూస్
Scroll for the next article