News5th Oct 04:15 PMSunil Byrisetty1 min read

7న ఫ్యాప్టో పోరుబాట

అక్టోబర్ 7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ లో జరిగే ఫ్యాప్టో పోరుబాట కార్యక్రమానికి ఉపాధ్యాయ లోకమంతా తరలిరావాలని ఎస్. టి.యు భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపునిచ

7న ఫ్యాప్టో పోరుబాట
అక్టోబర్ 7వ తేదీన విజయవాడ ధర్నా చౌక్ లో జరిగే ఫ్యాప్టో పోరుబాట కార్యక్రమానికి ఉపాధ్యాయ లోకమంతా తరలిరావాలని ఎస్. టి.యు భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యారంగ ఆర్థికపరమైన సమస్యల సాధనకై ఫ్యాప్టో రాష్ట్ర కమిటీ నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమానికి ఉపాధ్యాయులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఏకీకృత సర్వీసు రూల్స్ సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటే ప్రభుత్వం పట్టించుకోలేదని, ఒకవైపు బోధ నేతర కార్యక్రమాలు మితిమీరి పోతున్నాయని, మరోవైపు యాపుల భారం పెరిగిపోతుందని అన్నారు. 12వ పిఆర్సి కమిషన్ అమలు చేయకపోవడం, మధ్యంతర భృతిని ప్రకటించకపోవడం, పెండింగ్ డి.ఎ లను ఇవ్వకపోవడం, లాంటి అనేక సమస్యలపై ఉద్యోగులు, ఉపాధ్యాయులలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉన్నదని అన్నారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఎస్ చిరంజీవి మాట్లాడుతూ కరోనాలో మరణించిన ఉపాధ్యాయుల కుటుంబ వారసులకు కారుణ్య నియామకాలను చేపట్టకపోవడం దారుణమని, సిపిఎస్ రద్దు చేయలేదని,మెమో 57ను అమలు చేసి 2003 డియస్సి వారిని పాత పెన్షన్ విధానంలోకి తీసుకురాక పోవడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆలస్యం చేయడం సరికాదని, హై స్కూల్ ప్లస్ లను నిర్వీర్యం చేయడం తగదని అన్నారు.
Andhra Pradesh Teachers
FAPTO Protest
Teachers Protest
Vijayawada Dharna Chowk
Education Department
STU Bhavan
Sai Srinivas
Chiranjeevi
CPS Abolition
ప్రభుత్వ ఉద్యోగులు
విద్యా విధానం
ఉపాధ్యాయ హక్కులు
Scroll for the next article