News4th Jul 11:11 AMSunil Byrisetty1 min read
రైతు దశ తిప్పిన వజ్రం!
కర్నూలు జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రామస్తులు పొలాల్లోకి వెళ్లి వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. జొన్నగిరి, తుగ్గలి, ఎర్రగుడి, పగిడిరాయి లాంటి తదితర గ్రామాల్లోని ప్రజలు వజ్రా
కర్నూలు జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే చాలు గ్రామస్తులు పొలాల్లోకి వెళ్లి వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. జొన్నగిరి, తుగ్గలి, ఎర్రగుడి, పగిడిరాయి లాంటి తదితర గ్రామాల్లోని ప్రజలు వజ్రాల కోసం పరుగులు తీస్తుంటారు. అక్కడ ప్రజలు వర్షపు తొలకరి జల్లులు పడగానే పొలాలను జల్లెడ పడతారు. తాజాగా తుగ్గలి మండలంలోని పెండేకల్లు గ్రామానికి చెందిన రోజువారీ కూలీ ఓ రైతు పొలంలో మట్టి పనులు చేస్తున్న సమయంలో మిలమిల మెరిసిపోతున్న వజ్రం కనిపించింది. మొదట ఆయన సాధారణంగా ఉన్న రాయి అని అనుకున్నాడు. ఆ తర్వాత స్థానికంగా ఉన్న వజ్రాల వ్యాపారి దగ్గరికి వచ్చి తనకు భూమిలో దొరికిన రాయిని చూపించాడు. అది రాయి కాదని అత్యంత విలువగల వజ్రమని వ్యాపారి చెప్పాడు. తనకు ఆ వజ్రం రూ.10 లక్షలకి అమ్మాలని వ్యాపారి కోరాడు. కానీ కూలీ మాత్రం ఆ వజ్రాన్ని అమ్మడానికి ఒప్పుకోలేదు. బహిరంగ మార్కెట్లో ఆ వజ్రానికి రూ. 50 లక్షల పైగానే పలుకుతుందని కూలీ ఊహించాడు. వందలాది మంది ఆ వజ్రాన్ని చూడటానికి తరలి వచ్చారు.