News11th Mar 04:38 PMSunil Byrisetty1 min read

జొన్నపంటకు మద్దతు ధర కల్పించాలి

నంద్యాల జిల్లాలో జొన్న పంటకు గిట్టుబాటు ధర లేక రైతుల నష్టపోతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి నంద్యాల జిల్లా ప్రజాప్రతినిధులు తీసుకొచ్చారు. అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చె

నంద్యాల జిల్లాలో జొన్న పంటకు గిట్టుబాటు ధర లేక రైతుల నష్టపోతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు దృష్టికి నంద్యాల జిల్లా ప్రజాప్రతినిధులు తీసుకొచ్చారు. అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుని కలిసి నంద్యాల జిల్లాలో రైతుల సమస్యలను మంత్రులు ఎన్ ఎండీ ఫరూఖ్, బీసీ జనార్థన్ రెడ్డి.. నంద్యాల జిల్లా ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియ, గిట్టా జయసూర్య విన్నవించారు. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో క్వింటా జొన్నలకు రూ. 2400 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. జొన్న పంటకు రూ. 3400 కు మద్దతు ధర పెంచి రైతులను ఆదుకోవాలని మంత్రులు విన్నవించారు. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రతిపాదనపై మంత్రి అచ్చెన్నాయుడు సానుకూలంగా స్పందించారు.
Farmers
Kinjarapu Atchannaidu
Andhra Pradesh
Nandyala
రైతులు
కింజరాపు అచ్చన్నాయుడు
ఆంధ్రప్రదేశ్
నంద్యాల
Scroll for the next article