Farmers2nd Oct 02:02 PMSunil Byrisetty1 min read

రైతుల హక్కులకు భద్రత.. రాజముద్రతో పాస్ పుస్తకాలు

మాకవరపాలెం మండలంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు వారి ప

రైతుల హక్కులకు భద్రత.. రాజముద్రతో పాస్ పుస్తకాలు
మాకవరపాలెం మండలంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు వారి పాస్ పుస్తకాలను స్వయంగా అందజేశారు. గతంలో భూములకు సరైన రికార్డులు లేకపోవడం వల్ల రైతుల ప్రమేయం లేకుండానే ఇతరులు బ్యాంకుల నుంచి రుణాలు పొందే పరిస్థితులు ఉండేవని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పాస్ పుస్తకాలపై రాజకీయ నాయకుల బొమ్మలు వేయడం వల్ల బ్యాంకుల్లో రుణాలు పొందేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎటువంటి రాజకీయ బొమ్మలు లేకుండా, కేవలం ప్రభుత్వ రాజముద్రతో పాటు భూమి స్పష్టమైన సరిహద్దులు, కొలతలు, మ్యాప్‌లతో కూడిన పాస్ పుస్తకాలను అందజేస్తున్నామని తెలిపారు. దీనివల్ల భవిష్యత్తు తరాలకు కూడా భూ వివాదాలు లేకుండా భద్రత చేకూరుతుందని స్పష్టం చేశారు.
Scroll for the next article